రోడ్డు ప్రమాదంలో భోజ్‌పురి నటి మనీషా రాయ్ దుర్మరణం

  • షూటింగ్‌కు బైక్‌పై వెళ్తుండగా ఢీకొన్న కారు
  • అక్కడికక్కడే మృతి
  • విషాదంలో భోజ్‌పురి చిత్ర పరిశ్రమ
ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భోజ్‌పురి నటి మనీషా రాయ్ (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఓ షూటింగ్‌లో పాల్గొనేందుకు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఆమెను వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే డ్రైవర్‌ను పట్టుకుంటామని ఎస్పీ ఎస్‌పీ గంగూలీ తెలిపారు.

మనీషాతోపాటు ప్రయాణిస్తున్న సంజీవ్ మిశ్రా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. మనీషా రాయ్ మృతి విషయం తెలిసి భోజ్‌పురి చిత్రసీమలో విషాదం నెలకొంది. పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Go Back to Shorts
Bhojpuri
Manisha Rai
accident
Uttar Pradesh

More Telugu News